సమగ్ర కుటుంబ సర్వే పేరుతో సైబర్ మోసం.. కేటుగాళ్ల కొత్త ఎత్తుగడ
- మొబైల్ కు ఇలాంటి లింక్ వస్తే క్లిక్ చేయొద్దంటున్న పోలీసులు
- సర్వే పేరుతో ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పొద్దని హెచ్చరిక
- అధికారులే నేరుగా ఇంటికి వచ్చి సర్వే చేస్తారని వెల్లడి
ఈ నెల 6 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఈ సర్వే కోసం అధికారులు, ప్రభుత్వ సిబ్బంది నేరుగా మీ ఇంటికే వస్తారని, వివరాలు నమోదు చేసుకుని వెళతారని సైబర్ పోలీసులు స్పష్టత నిచ్చారు. ఫోన్ ద్వారా, ఆన్ లైన్ లింక్ ల ద్వారా సర్వే చేయడంలేదని వివరించారు. ఈ సర్వే పేరుతో ఏదైనా లింక్ లు కానీ ఫోన్ కాల్ కానీ వస్తే స్పందించవద్దని సూచించారు. సైబర్ కేటుగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ముందుగానే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.