అమెరికాలో ట్రంప్ విజయం... తగ్గిన బంగారం ధరలు
- ఇటీవల బాగా తగ్గిన పసిడి ధర
- అమెరికా ఎన్నికలు ముగిశాక ఇంకాస్త తగ్గిన వైనం
- రెండ్రోజుల్లోనే 10 గ్రాములపై రూ.2,100 వరకు తగ్గుదల
అమెరికా ఎన్నికలు ముగిశాక ఈ రెండ్రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ.2,100 వరకు పతనమైంది. భారత మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.76,570గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.74,720గా ఉంది.
అదే సమయంలో, వెండి ధరలోనూ భారీ తగ్గుదల కనిపించింది. కేజీ వెండిపై రూ.4,050 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.90,601గా ఉంది.