ట్రంప్ గెలుపు ఎఫెక్ట్... రూ.2 లక్షల కోట్లు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద
- ట్రంప్ గెలుపుతో భారీగా లాభపడిన మస్క్ కంపెనీల షేర్లు
- 290 బిలియన్ డాలర్లకు చేరుకున్న మస్క్ నికర సంపద
- జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, వారెన్ బఫెట్ సంపద కూడా జంప్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద కూడా 7.14 బిలియన్ డాలర్లు పెరిగింది. మన కరెన్సీలో దాదాపు రూ.60 వేల కోట్లు. దీంతో బెజోస్ సంపద 228 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు, సీటీవో అయిన లారీ ఎలిసన్, ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నికర సంపద కూడా పెరిగింది. ట్రంప్ గెలుపుతో అమెరికా స్టాక్ మార్కెట్లు దూకుడును ప్రదర్శించాయి.