డొనాల్డ్ ట్రంప్ విజయంపై చంద్రబాబు స్పందన

Chandrababu Naidu on Donald Trump victory
  • ట్రంప్ కు అభినందనలు తెలిపిన చంద్రబాబు
  • అమెరికాను ముందుకు తీసుకెళ్లడంలో విజయవంతం కావాలని ఆకాంక్ష
  • ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని విశ్వసిస్తున్నానన్న బాబు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గ్రాండ్ విక్టరీ సాధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 

ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ... 
"అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ కు అభినందనలు. అమెరికాను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన విజయవంతం కావాలని కోరుకుంటున్నా. యూఎస్ ప్రెసిడెంట్ గా ట్రంప్ మొదటి పదవీకాలంలో అమెరికా-ఇండియా సంబంధాలు బలోపేతమయ్యాయి. ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ ట్రంప్ ల నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారం మరింత బలోపేతం అవుతాయని విశ్వసిస్తున్నా" అని తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Donald Trump
USA

More Telugu News