Vijay Deverakonda: యాక్ష‌న్ సన్నివేశాల చిత్రీక‌ర‌ణ‌.. న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండకు స్వల్ప గాయం

Actor Vijay Deverakonda Wounded in VD 12 Movie Shooting in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ యువ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న కొత్త‌ చిత్రంలోని యాక్ష‌న్ సన్నివేశాలు చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాడు. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో 'వీడీ12' వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ మూవీ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలోని ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తుండ‌గా విజ‌య్‌కు స్ప‌ల్ప గాయ‌మైంది. 

దాంతో చిత్రం యూనిట్ వెంట‌నే ఆయ‌న‌ను స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించింది. అక్క‌డ ఫిజియోథెర‌పీ చేసిన అనంత‌రం మ‌ళ్లీ విజ‌య్ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ మూవీలో విజ‌య్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 2025 మార్చి 28న సినిమా విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత రాహుల్ సాంకృత్యాయ‌న్‌, ర‌వికిర‌ణ్ కోలా డైరెక్ష‌న్‌ల‌లో వ‌రుస‌గా రెండు సినిమాల్లో విజ‌య్ న‌టించ‌నున్నాడు.  
Go Back to Shorts
Vijay Deverakonda
Hyderabad
Tollywood

More Telugu News