నిజమే దిల్‌ రాజు గారు మీరు ట్రాక్‌ తప్పారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిజమే దిల్‌ రాజు గారు మీరు ట్రాక్‌ తప్పారు!

Indeed Dil Raju you have lost track
  • లక్కీ భాస్కర్‌ సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న దిల్‌ రాజు 
  • ట్రాక్‌ తప్పాను అంటూ దిల్‌ రాజు కీలక వ్యాఖ్యలు 
  • దిల్‌ రాజు కమ్‌ బ్యాక్‌ విత్‌ బ్యాంగ్‌ అంటూ నెటిజన్లు కామెంట్స్‌  

'దిల్‌'రాజు ఈ పేరు నిర్మాతగా ఓ బ్రాండ్‌... వైవిధ్యమైన కథలతో, నూతన దర్శకులతో చిత్రాలను నిర్మించి ఎన్నో మరిచిపోలేని ఘనవిజయాలు అందుకున్నాడు. కొత్త కథలతో సినిమాలు తీయడంలో, నవతరం ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో 'దిల్‌' రాజు ఎప్పుడూ ముందుండేవాడు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు దిల్‌ రాజు కూడా రెగ్యులర్‌ కమర్షియల్‌ నిర్మాతల బాటలో సినిమాలు తీస్తున్నాడనేది కాదనలేని నిజం. కొత్త దర్శకులతో, ఆయన అభిరుచికి తగ్గ  సినిమాలు తీయడం తగ్గించాడు. 

స్టార్‌ హీరోలతో, క్రేజీ దర్శకులతో సినిమాలు తీస్తూ హిట్‌లు అందుకుంటున్నాడేమో కానీ, జనాలు ఆశిస్తున్న సినిమాలు అందించ లేకపోతున్నాడు. బొమ్మరిల్లు, ఆర్య, కొత్త బంగారులోకం లాంటి సినిమాలు దిల్‌ రాజు నుంచి ఆశించిన ప్రేక్షకులకు గత సంవత్సరం 'బలగం' సినిమాతో మరో కల్ట్‌ సినిమాను ఇచ్చాడు. తెలంగాణ సంప్రదాయాలు, యాస, భావోద్వేగాలపై బలగం సినిమా నిర్మించి మరోసారి 'దిల్‌' రాజు తన జడ్జిమెంట్‌ను నిరూపించుకున్నాడు. 

పూర్వకాలంలో తెరలు కట్టుకుని సినిమాలు చూసే సంప్రదాయాన్ని మళ్లీ బలగం సినిమాతో తెరపైకి తీసుకొచ్చాడు. ఈ సినిమా మరోసారి దిల్‌ రాజు అభిరుచిని తెలియజేసింది. ప్రస్తుతం దిల్‌ రాజు రామ్‌చరణ్‌, శంకర్‌ కలయికలో గేమ్‌ ఛేంజర్‌తో పాటు నితిన్‌, వేణు శ్రీరామ్‌ కాంబినేషన్‌లో తమ్ముడు, ఆశిష్‌తో సెల్పీష్‌ చిత్రాలను నిర్మిస్తున్నాడు. 

అయితే ఎందుకో దిల్‌ రాజుకు నిర్మాతగా తనను తాను మిస్‌ అవుతున్నాననే ఫీలింగ్‌ కలిగిందో.. లేక పెద్ద సినిమాల హడావుడిలో తన ఒరిజినల్‌ స్ట్రెంగ్త్‌ను మరిచిపోతున్నానని అనిపించిందో తెలియదు కానీ, నిన్న 'లక్కీ భాస్కర్‌' సక్సెస్‌ మీట్‌లో "నేను ఈ మధ్య ట్రాక్‌ తప్పాను. నన్ను నేను వంశీలో చూసుకుంటున్నాను.. " అని ఎటువంటి మెహమాటం లేకుండా తన మనసులోని భావాలను వ్యక్తపరిచాడు.

 'దిల్‌' రాజు నోటి వెంట ఈ మాటలు వింటుంటే... ఆ మధ్య 'మహారాజా' సినిమా ప్రమోషన్‌  ఇంటర్వ్యూలో  దర్శకుడు బుచ్చిబాబు ' మీరు ఎవరినైనా మిస్‌ అవుతున్నారా'  అని విజయ్‌ సేతుపతిని అడిగిన ప్రశ్నకు 'నన్ను నేనే మిస్‌ అవుతున్నాను' అంటూ ఆయన చెప్పిన సమాధానం గుర్తొచ్చింది.  

మహారాజా సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో విజయ్‌ సేతుపతి చెప్పిన ఈ సమాధానం తనను తాను మిస్‌ అవుతున్నాననే ఫీలింగ్‌ ఉన్న వాళ్లందరిని కదిలించింది. సో... దిల్‌ రాజు కూడా తనను తాను మిస్‌ అవుతున్నాననే ఫీలింగ్‌లో ఉన్నాడేమో అనిపించింది. కానీ దిల్‌ రాజును మళ్లీ అందరూ విజయాల రాజుగా చూడాలని.. ఆయన నుంచి మరిన్ని మరపురాని సినిమాలు రావాలని ఆశిస్తున్నారు. అయితే ఇదంతా దిల్‌ రాజు తెలియని కొత్త విషయమేమీ కాదు. తప్పకుండా హీ విల్‌ బ్యాక్‌ విత్‌ బ్యాంగ్‌!. 
Advertisement
Dil Raju
Naga vamsi
Tollywood
Cinema
Lucky Baskhar
Dil raju speech
Dil raju new films

More Telugu News