తెలుగు రాష్ట్రాల పోలీసులకు ‘గృహమంత్రి దక్షతా పదక్’ అవార్డులు
- పటేల్ జయంతిని పురస్కరించుకుని పోలీసులకు అవార్డులు ప్రకటించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
- దేశ వ్యాప్తంగా 463 మంది పోలీసులకు అవార్డులు
- తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఎస్పీలతో పాటు పలువురు కానిస్టేబుళ్లకు పురస్కారాలు
వీరిలో ఏపీ, తెలంగాణ సహా అస్సాం, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు, ఢిల్లీ, జమ్మూకశ్మీర్, చండీగఢ్ తదితర కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పోలీసులు, సీబీఐ, సీఆర్పీఎఫ్, ఎన్ఐఏ, ఎన్సీపీ, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ బలగాల సిబ్బంది ఉన్నారు. ఏపీ నుంచి ఇద్దరు ఎస్పీలు, తెలంగాణ నుండి ఒక ఎస్పీతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పోలీస్ కానిస్టేబుళ్లకు ఈ అవార్డులు లభించాయి.