జనగణనతో పాటు బీసీ గణనా చేపట్టాలి .. సీఎంకు బీసీ సంఘాల వినతి

జనగణనతో పాటు బీసీ గణనా చేపట్టాలి .. సీఎంకు బీసీ సంఘాల వినతి

bc community leaders meet cm chandrababu
  • సీఎం చంద్రబాబును కలిసిన బీసీ సంఘాల నేతలు 
  • వరద బాధితులకు రూ.10 లక్షల విరాళం అందజేత
  • అమరావతి రాజధానిలో జ్యోతిరావ్ పూలే స్మృతివనం ఏర్పాటు చేయాలని వినతి
2025 నుంచి దేశ వ్యాప్తంగా జనగణన జరగనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి బీసీ సంఘాల నేతలు కీలక వినతి చేశారు. జనగణనతో పాటు బీసీ గణన కూడా చేపట్టాలని సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ అధ్యక్షులు కేసన శంకర్ రావు నేతృత్వంలో బీసీ ప్రతినిధుల బృందం సీఎంను ఉండవల్లి నివాసంలో కలిసి 10 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందించింది. 

అమరావతి రాజధానిలో జ్యోతిరావ్ పూలే స్మృతివనం ఏర్పాటు చేయాలని, బీసీ రిజర్వేషన్లను దామాషా ప్రకారం పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, బీసీలపై పెట్టిన తప్పుడు క్రిమినల్ కేసులు మాఫీ చేయాలని విన్నవించారు. బీసీ నేతలు లేవనెత్తిన అంశాలను సావధానంగా విన్న సీఎం.. వారి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీసీ నేతలు వరద బాధితుల సహాయార్ధం రూ.10 లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించగా, చంద్రబాబు వారిని అభినందించారు. 
Advertisement
Chandrababu
Amaravati
BC Census

More Telugu News