'రాజాసాబ్' మోషన్ పోస్టర్.. ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా డార్లింగ్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రాజాసాబ్' మోషన్ పోస్టర్.. ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా డార్లింగ్‌!

Prabhas The Raja Saab Motion Poster Released
  • ప్ర‌భాస్ బ‌ర్త్‌డే స్పెషల్ 'రాజాసాబ్' మోషన్ పోస్టర్ 
  • సింహాసనంపై కూర్చొని సిగార్ కాలుస్తూ స‌రికొత్త‌గా ప్ర‌భాస్ ద‌ర్శ‌నం
  • ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదుర్స్
రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా 'ది రాజా సాబ్' మేకర్స్, అభిమానుల కోసం ఓ డిఫరెంట్ మోషన్ పోస్టర్ ను విడుద‌ల చేశారు. అందులో డార్లింగ్ ఇంత‌కుముందు ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా కనిపించారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ సింహాసనంపై కూర్చొని సిగార్ కాలుస్తూ రాజు లుక్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌డం విశేషం. ఇక ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. 

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి డైరెక్ష‌న్‌లో హారర్ కామెడీ జాన‌ర్‌లో రాజాసాబ్ తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చాలావ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. మిగిలిన చిత్రీకరణను వీలైనంత త్వరగానే పూర్తి చేసే ప‌నిలో చిత్ర బృందం ఉంది.

ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో క‌నిపించ‌నున్నారు. ప్రభాస్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. 

ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్‌ కానుంది.

Advertisement
The Raja Saab
Prabhas
Tollywood

More Telugu News