నాగార్జున పరువునష్టం దావా... కోర్టులో కొండా సురేఖ రిప్లై దాఖలు
- కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్
- తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసిన కోర్టు
- ఇదివరకే నాగార్జున సహా సాక్షుల వాంగ్మూలం నమోదు చేసిన కోర్టు
మంత్రి తరఫున ప్రముఖ న్యాయవాది గుర్మీత్ సింగ్ కోర్టులో సమాధానాన్ని ఫైల్ చేశారు. అనంతరం కోర్టు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జునపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.