కేజీఎఫ్‌ నిర్మాత అందిస్తున్న మరో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'బఘీర'
Add ap7am to your home Screen

కేజీఎఫ్‌ నిర్మాత అందిస్తున్న మరో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'బఘీర'

Another huge action entertainer Baghira produced by KGF producer
  • బఘీరకు కథ అందించిన ప్రశాంత్‌నీల్‌ 
  • థ్రిల్లింగ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా బఘీర 
  • అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు బఘీర
కేజీఎఫ్‌, సలార్‌ లాంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్‌ అధినేత విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన మరో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'బఘీర'. ఉగ్రమ్‌ ఫేమ్‌ శ్రీమురళి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కథ అందించడం విశేషం. డాక్టర్‌ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్‌ 31న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ లిరికల్ సాంగ్‌ 'రుధిర హర'ను ఈ  నెల 17న విడుదల చేస్తున్నారు. 

'బఘీర' చిత్రం థ్రిల్లింగ్‌ యాక్షన్‌ ఏపిసోడ్స్‌తో, ఆకట్టుకునే విజువల్స్‌తో ఉండబోతుందని, హీరో శ్రీమురళి పాత్ర ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి గురిచేసే విధంగా ఉంటుందని నిర్మాత అంటున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ తెలుగులో విడుదల చేస్తుంది. 

రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఏజే శెట్టి డీవోపీ కాగా, కాంతార ఫేమ్‌ బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. 
Advertisement
Baghira
Vijay Kiragandur
Prashanth Neel
Sri murali
Hombale Films
Bagheera release date

More Telugu News