రతన్ టాటా చివరి సోషల్ మీడియా పోస్ట్ ఇదే..!
- తన ఆరోగ్యంపై వదంతుల వ్యాప్తి పట్ల స్పందించిన రతన్ టాటా
- నిరాధారమైన ప్రచారమని చెప్పిన వ్యాపార దిగ్గజం
- సోమవారమే సోషల్ మీడియా వేదికగా చివరి పోస్ట్ పెట్టిన రతన్ టాటా
‘‘నా గురించి ఆలోచిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు’' అనే క్యాప్షన్‌తో రతన్ టాటా స్పందించారు. ‘‘ నా ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల పుకార్లు వ్యాపిస్తున్నాయని నాకు తెలుసు. ఇవన్నీ నిరాధారమైనవని మీకు చెప్పాలనుకుంటున్నాను. నా వయసు సంబంధిత ఆరోగ్య పరిస్థితుల కారణంగా ప్రస్తుతం నేను వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఉల్లాసంగానే ఉన్నాను ...’’ అని రతన్ టాటా పేర్కొన్నారు. కానీ రెండు రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా ఆయన కన్నుమూశారు.