ఎన్నికల్లో అతివిశ్వాసం పనికిరాదు: హర్యానాలో ఒక్క సీటూ రాకపోవడంపై కేజ్రీవాల్
- హర్యానా ఎన్నికల ఫలితాలు గుణపాఠమన్న కేజ్రీవాల్
- ఏ ఎన్నికలనూ తేలికగా తీసుకోవద్దన్న మాజీ సీఎం
- ప్రతి ఎన్నిక... ప్రతి సీటు కూడా ఎంతో క్లిష్టమైనదని వ్యాఖ్య
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... ఈ ఫలితాలు (హర్యానా ఎన్నికలు) అతిపెద్ద గుణపాఠం... ఎప్పుడూ అతివిశ్వాసం ఉండరాదని కేజ్రీవాల్ అన్నారు. హర్యానాలో ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో చూద్దామని వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికలను కూడా తేలికగా తీసుకోవద్దని సూచించారు. ప్రతి ఎన్నిక, ప్రతి సీటు కూడా ఎంతో క్లిష్టమైనదన్నారు.