19 ఏళ్ల వయసులో రష్మిక తొలి ఆడిషన్.. వైరల్ అవుతున్న వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

19 ఏళ్ల వయసులో రష్మిక తొలి ఆడిషన్.. వైరల్ అవుతున్న వీడియో ఇదిగో!

Rashmika Mandanna first audition at 19 here is the video
  • తన పేరు రష్మిక అని తనను తాను పరిచయం చేసుకున్న నటి
  • అందరి ముందు మాట్లాడడంలో కొంత తడబాటు
  • తన తొలి ఆడిషన్ ఇదేనని నిర్వాహకులతో చెప్పిన రష్మిక
పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయిన రష్మిక మందన్న 19 ఏళ్ల వయసులో హాజరైన ఓ ఆడిషన్‌కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చి అభిమానులను కట్టిపడేస్తోంది. 2014లో కాలేజీ రోజుల్లో ‘ఫ్రెష్ ఫేస్ కాంపిటిషన్’ విజేతగా నిలిచిన రష్మిక 2016లో తెరంగేట్రం చేసింది. 2017లో సహ నటుడు రక్షిత్ షెట్టితో ఎంగేజ్‌మెంట్ అయినా వ్యక్తిగత కారణాలతో 2018లో అది రద్దయింది.

2018లో ‘చలో’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కాలు మోపిన రష్మిక ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సీతా రామం’, ‘పుష్ప’ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోని పలు భాషల్లోనూ సినిమాలు చేసింది. 2022లో ‘గుడ్ బై’ సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె ‘పుష్ప: ది రూల్’, కుబేర, రెయిన్ బో, ద గాళ్ ఫ్రెండ్, చావా, సికందర్ వంటి సినిమాలు చేస్తోంది . 

తాజాగా వైరల్ అవుతున్న రష్మిక తొలి ఆడిషన్ వీడియో క్లిప్‌లో ఆమె తనను తాను పరిచయం చేసుకుంటూ తన వయసు 19 ఏళ్లని, కాలేజీ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో కొంత ఉద్వేగంగా కనిపించింది. కన్నడలో మాట్లాడాలని నిర్వాహకులు కోరగా రష్మిక కొంత తడబడింది. ‘‘నాకు అర్థం కాలేదు. నేను చేయలేను’ అని చెప్పుకొచ్చింది. అయితే, వీడియో చివరికొచ్చేసరికి మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అంతేకాదు, ‘ఆజా నాచ్‌లే’ అనే బాలీవుడ్ పాటకు డ్యాన్స్ కూడా చేసింది.
Advertisement
Rashmika Mandanna
Tollywood
Kannada
Rashmika Audition

More Telugu News