పార్లమెంటరీ కమిటీలో ఎంపీ కంగనాకు చోటు
- డిఫెన్స్ కమిటీలో రాహుల్ గాంధీకి మరోసారి అవకాశం
- మొత్తం నాలుగు కమిటీలకు కాంగ్రెస్ ఎంపీల నేతృత్వం
- కీలక కమిటీలకు బీజేపీ ఎంపీల సారథ్యం
విదేశీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన కమిటీకి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్; విద్య, మహిళా, శిశు, యువత, క్రీడలకు సంబంధించిన కమిటీకి దిగ్విజయ్ సింగ్; వ్యవసాయం, పశువులు, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీకి చరణ్ జిత్ సింగ్ చన్నీ; గ్రామీణం, పంచాయతిరాజ్ కమిటీకి సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వం వహిస్తారు. కాగా, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మాత్రం ఏ కమిటీలోనూ చోటు దక్కలేదు. ఇక బీజేపీ ఎంపీల సారథ్యంలో కీలకమైన రక్షణ, ఆర్థిక, హోం, బొగ్గు, గనులు, ఉక్కు, సమాచార, ఐటీ కమిటీలు ఉన్నాయి.