ఢిల్లీ లిక్కర్ కేసు.. కోర్టు విచారణకు హాజరైన కవిత
- సీబీఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు
- వర్చువల్ గా కోర్టు విచారణకు హాజరైన కవిత
- తదుపరి విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా
ప్రతివాదులకు సీబీఐ అందజేసిన ప్రతులు సరిగా లేవని విచారణ సందర్భంగా కోర్టుకు న్యాయవాదులు తెలిపారు. దీంతో, సరైన ప్రతులను ప్రతివాదులకు అందజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 27వ తేదీన కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.