జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

Court imposes Jani Master 14 days judicial remand
  • జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు
  • పోక్సో చట్టం కింద కేసు
  • గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్
  • హైదరాబాద్ తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
అత్యాచారం కేసులో అరెస్టయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను హైదరాబాద్ పోలీసులు నేడు ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబరు 3 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అనంతరం, పోలీసులు జానీ మాస్టర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. 

ఈ సందర్భంగా జానీ మాస్టర్ తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. 

జానీ మాస్టర్ తనపై కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. పోక్సో కేసు నేపథ్యంలో, జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు.
Go Back to Shorts
Jani Master
Judicial Remand
Chanchalguda Jail
Hyderabad
Police
Tollywood

More Telugu News