కమల, బైడెన్ లపై ఎవరూ హత్యాయత్నం చేయడంలేదేం?: మస్క్
--
ఈమేరకు ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. ట్రంప్‌నే ఎందుకు చంపాలనుకుంటున్నారని ఓ యూజర్ చేసిన పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం మరోమారు అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎలాన్ మస్క్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఇటీవల ఆయనతో ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఆ ఇంటర్వ్యూ ప్రసారమయ్యే సమయంలో ట్విట్టర్ పై సైబర్ దాడి జరగడంతో చాలామంది ట్రంప్ అభిమానులకు అది చేరలేదు.