ప్రభాస్ సినిమా నుంచి తనను తీసేశారన్న రకుల్.. ఎందుకో చెప్పిన నిర్మాత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ సినిమా నుంచి తనను తీసేశారన్న రకుల్.. ఎందుకో చెప్పిన నిర్మాత!

actress rakul preet singh says i am sacked from the prabhas movie
  • 'మిస్టర్ ఫర్ ఫెక్ట్'లో చాన్స్ వచ్చిందన్న రకుల్ 
  • కనీస సమాచారం లేకుండా తీసేశారని వెల్లడి  
  • రషెస్ సంతృప్తి కల్గించలేదని, అందుకే కాజల్ ని తీసుకున్నామన్న దిల్ రాజు
హిందీ చిత్ర పరిశ్రమలో దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ .. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తూ బిజీబీజీగా ఉంది. 2009లో కన్నడ చిత్రం గిల్లీతో సినీరంగ ప్రవేశం చేసిన రకుల్ .. 2013లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌తో తెలుగులోకి వచ్చారు. 2014లో యారియన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ లో థాంక్ గాడ్, రన్ వే 34, డాక్టర్ జీ, దేదే ప్యార్ దే వంటి అనేక చిత్రాలలో నటించారు. ధృవ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, లౌక్యం, జయ జానకి నాయక లాంటి తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇటీవల ఇండియన్ 2 చిత్రంలో రకుల్ ప్రేక్షకులకు కనువిందు చేశారు. ప్రస్తుతం దేదే ప్యార్ దే 2లో నటిస్తున్నారు. 

తెలుగు స్టార్ హీరోలతో నటించిన రకుల్ హవా ఇటీవల కాలంలో పూర్తిగా తగ్గిపోయింది. టాలీవుడ్‌లో చివరిగా కొండపొలం చిత్రంలో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీబీజీగా ఉన్న రకుల్ .. తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను ప్రభాస్ సినిమా నుండి చెప్పకుండానే తీసేశారని చెప్పింది. ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందన్నారు. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభాస్ సరసన నటించే అవకాశం రావడంతో చాలా సంతోషించానని చెప్పింది. అయితే నాలుగు రోజుల పాటు షూటింగ్ పూర్తి చేసుకుని తాను ఢిల్లీకి వెళ్లగా, ప్రభాస్ సినిమా నుండి తనను తొలగించినట్లు తెలిసిందన్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని పేర్కొంది. మరో తెలుగు సినిమాలోనూ ఇలాగే జరిగిందన్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాక ముందే తొలగించారని చెప్పింది. ఆ తర్వాత తనకు ఇండస్ట్రీపై అవగాహన వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకూడదని అనుకున్నానని తెలిపింది. 

ప్రభాస్ సినిమా నుండి తనను తొలగించారని రకుల్ కామెంట్స్ చేయడంతో ఆ చిత్రం ఏమిటనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ చిత్రం మరేదో కాదు మిస్టర్ ఫర్ ఫెక్ట్.  ఈ చిత్రంలో ముందుగా ప్రభాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు. ఈ విషయంపై మిస్టర్ ఫర్ ఫెక్ట్ నిర్మాత దిల్ రాజు వివరణ కూడా ఇచ్చారు. రకుల్‌తో అయిదు రోజుల పాటు షూటింగ్ కూడా చేశామని, అయితే ఆ రషెస్ సంతృప్తి కల్గించలేదన్నారు. ఎందుకంటే మిస్టర్ ఫర్ ఫెక్ట్ మూవీ అంతా హీరోయిన్ క్యారెక్టర్ బేస్ చేసుకుని ఉంటుందని, రకుల్ చాలా సన్నగా ఉందని చెప్పారు. ఎందుకయినా మంచిదని చెప్పి షూటింగ్ ఆపేశామని, విషయాన్ని ప్రభాస్ కు కూడా చెప్పి డిస్కస్ చేసిన తర్వాత కాజల్ అగర్వాల్‌ను రకుల్ ప్లేస్‌లో తీసుకోవడం జరిగిందన్నారు. రకుల్‌ను అలా పక్కన పెట్టడం అనేది తమకు చాలా బాధ అనిపించిందని, అయితే తమకు సినిమా కంటే ఏదీ ఎక్కువ కాదని అన్నారు. వ్యక్తుల కంటే సినిమా వర్క్ వుట్ కావాలని చూస్తానని, అందుకే రకుల్ ప్లేస్‌లో కాజల్‌ను తీసుకుని సినిమా చేశామని నిర్మాత దిల్ రాజు వివరణ ఇచ్చారు.
Advertisement
actress rakul preet singh
Prabhas
Movie News
entertainment news

More Telugu News