వినాయ‌క చ‌వితి స్పెష‌ల్... 'కుబేర' నుంచి కొత్త‌ పోస్ట‌ర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వినాయ‌క చ‌వితి స్పెష‌ల్... 'కుబేర' నుంచి కొత్త‌ పోస్ట‌ర్

Special Poster from Kubera Movie
  • త‌మిళ న‌టుడు ధ‌నుశ్‌, శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో 'కుబేర'
  • ప్ర‌త్యేకపాత్ర‌లో న‌టిస్తున్న టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున
  • వినాయ‌క చ‌వితి విషెస్ చెబుతూ మూవీ నుంచి స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్‌
టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున ప్రత్యేకపాత్రలో, త‌మిళ న‌టుడు ధనుశ్‌ కథానాయకుడిగా టాలెండ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘కుబేర’. నేష‌న‌ల్ క్ర‌ష్‌ రష్మిక మందన్న ఈ మూవీలో కథానాయికగా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, గ్లింప్స్ అభిమానులను బాగానే ఆక‌ట్టుకున్నాయి. 

అందులోనూ శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల‌కు ప్ర‌త్యేకంగా ఒక ఫ్యాన్‌బేస్ ఉంది. మినీమం గ్యారెంటీ చిత్రాల‌ను ఆయ‌న ప్రేక్ష‌కుల‌కు అందిస్తుంటారు. దీనికి ఉదాహ‌ర‌ణ ఆనంద్‌, హ్యాపీడేస్‌, లీడ‌ర్‌, ఫిదా, లవ్‌స్టోరీ వంటి సూప‌ర్ కూల్‌ సినిమాలే.

ఇక నేడు వినాయ‌క చ‌వితిని పుర‌స్క‌రించుకుని కుబేర చిత్రం యూనిట్‌ శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. మూవీ నుంచి కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ఒక‌వైపు ధ‌నుష్ ఉండ‌గా.. మ‌రోవైపు నాగార్జున ఉన్నారు. ఈ పోస్ట‌ర్‌ను చూడ‌గానే ఆక‌ట్టుకునేలా మేక‌ర్స్ చాలా బాగా డిజైన్ చేశారు.

సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీకి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
Advertisement
Kubera Movie
Tollywood
Vinayaka Chavithi

More Telugu News