2029లోనూ విజయం సాధిస్తాం: ప్రధాని మోదీ ధీమా

PM Modi is confident of winning 2029 elections
  • ముంబయిలో గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్న నరేంద్రమోదీ
  • తాము ప్రజాదరణ కోల్పోయామంటున్నారు... కానీ నాలుగోసారి గెలుస్తామని వ్యాఖ్య
  • 2029లో నిర్వహించబోయే గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్‌కూ వస్తానన్న ప్రధాని
నాలుగోసారి కూడా విజయం సాధిస్తామని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. 2029 లోక్ సభ ఎన్నికల్లో గెలిచి రికార్డ్ సృష్టిస్తామన్నారు. 

ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో నిర్వహించిన 'గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్‌-2024'లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ... ఎన్డీయే ప్రజాదరణ కోల్పోయిందని, అందుకే మెజార్టీ సీట్లు రాలేదని కొంతమంది అంటున్నారని, కానీ వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయి విజయం సాధిస్తామన్నారు.

ఇది ఐదో గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ అని, 2029లో జరిగే ఫెస్ట్‌కు కూడా ప్రధాని హోదాలో వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌కు వస్తున్న విదేశీ అతిథులు మన ఫిన్ టెక్ వైవిధ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ గణనీయ అభివృద్ధి సాధించిందన్నారు.
Advertisement
Narendra Modi
BJP
Lok Sabha Polls

More Telugu News