Avram Manchu: కన్నప్ప సినిమాతో తెరపైకి మంచు వారసుడు.. కీలక పాత్రలో అవ్రామ్

Avram Manchu As Thinnadu In Kannappa Carrying Manchu Legacy
షార్ట్స్‌లో చూడండి
మంచు విష్ణు ప్రధాన పాత్రలో మోహన్‌బాబు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో పలు చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీతో మంచు కుటుంబం నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేస్తున్నాడు. 

ఈ మూవీలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నేడు కృష్ణాష్టమని పురస్కరించుకుని అవ్రామ్ లుక్‌ను విడుదల చేశారు. మంచు విష్ణు చిన్నప్పటి పాత్ర అయిన తిన్నడుగా అవ్రామ్ ఇందులో కనిపించనున్నాడు. ఈ పోస్టర్‌ను షేర్ చేసిన మోహన్‌బాబు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
Go Back to Shorts
Avram Manchu
Kannappa
Manchu Vishnu
Mohanbabu Manchu

More Telugu News