ప్రభాస్ పై అర్షద్ వార్సీ వ్యాఖ్యలను ఖండించిన మంచు విష్ణు

Manchu Vishnu condemns comments on Prabhas
  • 'కల్కి'లో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడన్న అర్షద్ వార్సీ
  • సినిమా అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలికి విష్ణు లేఖ
  • మరోసారి అలా మాట్లాడకుండా చూసుకోవాలన్న విష్ణు
'కల్కి' సినిమాలో ప్రభాస్ ఓ జోకర్ లా ఉన్నాడంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కామెంట్ చేయడంపై ప్రభాస్ అభిమానులు, టాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు. అర్షద్ వార్సీ వ్యాఖ్యలను ఖండిస్తూ సినిమా అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, సినీనటి పూనమ్ థిల్లాన్ కు 'మా' అధ్యక్షుడు, హీరో విష్ణు లేఖ రాశారు. 

ఇకపై అలా మాట్లాడకుండా నియంత్రించాలని లేఖలో విష్ణు కోరాడు. మనమంతా యాక్టర్స్ ఫ్యామిలీకి చెందినవాళ్లమని... ఒకరి గురించి ఇలా మాట్లాడటం సరికాదని అన్నాడు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గ్లోబల్ స్టార్ ప్రభాస్ పై ఇలా కామెంట్ చేయడం తెలుగువారి మనోభావాలను దెబ్బతీసిందని చెప్పాడు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని కోరాడు.
Advertisement
Manchu Vishnu
Prabhas
Tollywood

More Telugu News