వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆళ్ల నాని
- పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
- ఏలూరులో వైసీపీ కార్యాలయం కూల్చివేసినట్లు వెల్లడి
- లీజు ముగియడంతో స్థలాన్ని యజమానికి అప్పగించామని వివరణ
ఏలూరులో వైసీపీ కార్యాలయానికి సంబంధించి లీజు గడువు ముగిసిందని ఆళ్ల నాని చెప్పారు. దీంతో అక్కడ పార్టీ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన షెడ్లను కూల్చేశామని తెలిపారు. స్థలం యజమాని అనుమతితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపామని, ఆ తర్వాత షెడ్లను తొలగించి స్థలాన్ని అప్పగించామని వివరించారు.