ఫైవ్ స్టార్ హోటల్లో బాలుడి చోరీ.. రూ.1.50 కోట్లతో పరార్!
- జైపూర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్లి వేడుక
- స్నేహితుడితో కలిసి గుట్టుచప్పుడు కాకుండా హోటల్లోకి ప్రవేశించిన బాలుడు
- వరుడి తల్లి పక్కన ఉన్న బ్యాగుతో పరార్
- నిందితుల కోసం పోలీసుల గాలింపు
పెళ్లి రోజున వరుడు తన కుటుంబసభ్యులతో కలిసి ఏనుగు మీద ఊరేగింపుగా హోటల్‌కు వెళ్లాడు. ఆ హడావుడిలో 14 ఏళ్ల బాలుడు, తన స్నేహితుడితో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా హోటల్లోకి చొరబడ్డాడు. అక్కడ నిందితులిద్దరూ పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులను, వారి వస్తువులను జాగ్రత్తగా పరిశీలించారు. ఈ క్రమంలో పెళ్లి మండపం వద్ద ఉన్న వరుడి తల్లి.. రూ.1.50 కోట్ల నగదు ఉన్న బ్యాగును కింద పెట్టింది. ఇదే అదనుగా భావించిన మైనర్, బ్యాగును ఎవరికీ అనుమానం రాకుండా చాకచక్యంగా ఎత్తుకెళ్లిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.