డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారీస్ అధికారికంగా ఖరారు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా పోటీపడనుండడం గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా కమలా హ్యారీస్ వ్యాఖ్యానించారు. పార్టీ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మెజారిటీ ఓట్లు సాధించిన అనంతరం ఆమె ఈ విధంగా స్పందించారు. కాగా ఎన్నికల రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగిన తర్వాత పార్టీపై కమలా హ్యారీస్ పూర్తి నియంత్రణ సాధించారు. పార్టీకి చెందిన ఇతర నేతలెవరూ అభ్యర్థిత్వం కోసం ముందుకు రాలేదు. దీంతో ప్రధాన పార్టీ అధ్యక్ష నామినేషన్‌ను ఖరారు చేసుకోబోతున్న మొట్టమొదటి నల్లజాతీయురాలిగా, దక్షిణాసియా మహిళగా ఆమె నిలవడం లాంఛనప్రాయమైంది.