మీ హెయిర్ స్టయిల్ ఇలా ఉండకూడదు... శ్రీలంక క్రికెటర్లకు జయసూర్య క్లాస్!
- శ్రీలంక క్రికెట్ జట్టుకు తాత్కాలిక కోచ్ గా సనత్ జయసూర్య
- ఆటగాళ్లు హెయిర్ కట్ చేయించుకుని నీట్ గా ఉండాలని సూచన
- ఆటగాళ్ల నుంచి తాను క్రమశిక్షణ ఆశిస్తున్నానని స్పష్టీకరణ
క్రికెట్ అనేది జెంటిల్మన్ క్రీడ అని, యువ ఆటగాళ్లకు క్రమశిక్షణ అవసరమని జయసూర్య అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, ఆటగాళ్లందరూ జుట్టు కత్తిరించుకుని, సాధారణ హెయిర్ స్టయిల్ ను అనుసరించాలని సూచించాడు. క్రికెటర్లు నీట్ గా ఉండడం అవసరమని, అభిమానులు తమను గమనిస్తుంటారన్న విషయాన్ని క్రికెటర్లు గుర్తించాలని జయసూర్య పేర్కొన్నాడు.
తాను ప్రస్తుతం శ్రీలంక జట్టుకు తాత్కాలిక కోచ్ గా మాత్రమే ఉన్నానని, ఆటగాళ్లు క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటానని తెలిపాడు.
టీమిండియాతో శ్రీలంక టీ20 సిరీస్, వన్డే సిరీస్ ఆడనున్న నేపథ్యంలో జయసూర్య వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జయసూర్య వ్యాఖ్యలను శ్రీలంక ఆటగాళ్లు ఎంతవరకు పాటిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.
శ్రీలంక, టీమిండియా మధ్య టీ20 సిరీస్ జులై 27 నుంచి, వన్డే సిరీస్ ఆగస్టు 2 నుంచి జరగనున్నాయి.