జనసేన జెండాలో శ్రీచక్ర యంత్రాన్ని పెట్టడం హిందూ ధర్మాన్ని అవమానించడమే: ఆధ్యాత్మికవేత్త కమల సంతోష్ కుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జనసేన జెండాలో శ్రీచక్ర యంత్రాన్ని పెట్టడం హిందూ ధర్మాన్ని అవమానించడమే: ఆధ్యాత్మికవేత్త కమల సంతోష్ కుమార్

Kamala Santosh Kumar comments on Janasena flag
  • జనసేన జెండాలో శ్రీచక్ర యంత్రం ఉండటం దారుణమన్న సంతోష్ కుమార్
  • రాజకీయాలకు అమ్మవారి చిహ్నాన్ని ఉపయోగించడం ఏమిటని ప్రశ్న
  • ఇది అమ్మవారిని అవమానించడమేనని వ్యాఖ్య
జనసేన పార్టీ జెండాలో శ్రీచక్ర యంత్రం ఉండటాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కమల సంతోష్ కుమార్ తప్పుపట్టారు. శ్రీచక్ర యంత్రాన్ని జనసేన తన జెండాలో పెట్టుకోవడం దారుణమని... ఇది అమ్మవారిని, హిందూ ధర్మాన్ని అవమానించడమేనని చెప్పారు. రాజకీయాలకు అమ్మవారి చిహ్నాన్ని ఉపయోగించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. జనసేన పార్టీలో శ్రీచక్ర యంత్రాన్ని అనుమతించిన కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలని అన్నారు. హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Janasena Flag
Sri Chakra Yantram

More Telugu News