పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై తీర్పు ఈ నెల 18కి వాయిదా

Guntur court adjourns verdict on Pinnelli bail plea
  • టీడీపీ ఏజెంట్ పై దాడి, సీఐపై దాడి కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్
  • నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి
  • పిన్నెల్లికి బెయిల్ నిరాకరించిన మాచర్ల కోర్టు
  • గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, సీఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం పిన్నెల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాచర్ల కోర్టు తన బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఆయన గుంటూరు నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి పిటిషన్లపై నేడు గుంటూరు కోర్టు విచారణ చేపట్టింది. ఈ రెండు కేసుల్లో పోలీసు విచారణ జరుగుతున్నందున... తీర్పును ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది. 

పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా నేడు గుంటూరు కోర్టులో వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పీపీ అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. పిన్నెల్లికి నేర చరిత్ర ఉందని, ఈ కేసులో ఇంకా కొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని అశ్విని కుమార్ తెలిపారు. 

పిన్నెల్లి పోలీస్ కస్టడీ వివరాలను కూడా న్యాయస్థానానికి అందించారు. పిన్నెల్లి పోలీసు విచారణకు సహకరించడంలేదని వివరించారు. ఈ నేపథ్యంలో, పిన్నెల్లికి బెయిల్ ఇవ్వొద్దని కోరారు.
Go Back to Shorts
Pinnelli Ramakrishna Reddy
Bail
Court
YSRCP
Macherla

More Telugu News