షాకింగ్ యాక్సిడెంట్‌.. వ్య‌క్తి ప్రాణం తీసిన ఆవు.. ఇదిగో వీడియో!

Shocking Incident in Tamilnadu Video goes Viral on Social Media
  • ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్తున్న వ్య‌క్తిపై దాడి చేసిన ఆవు
  • బస్సు కింద పడి బైకర్ మృతి
  • తమిళనాడులోని తిరునల్వేలిలో ఘ‌ట‌న‌
తమిళనాడులోని తిరునల్వేలిలో షాకింగ్‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్తున్న వ్య‌క్తిపై ఆవు దాడి చేయ‌డంతో ఆ వ్య‌క్తి బ‌స్సు కింద ప‌డి మృత్యువాతప‌డ్డాడు. కోర్టు ఉద్యోగి అయిన‌ రాజ్ అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా రోడ్డు పక్కన రెండు ఆవులు కొట్లాడుకుంటున్నాయి. అందులో ఒక ఆవు ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చి బైకును ఒక్కసారిగా నెట్టివేసింది. దీంతో పక్కనే వెళ్తున్న బస్సు చక్రాల కింద పడి అతడు మృతిచెందాడు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
Go Back to Shorts
Tamilnadu
Social Media
Shocking Incident
Twitter

More Telugu News