నేడు తెలంగాణలోని 16 జిల్లాల్లో భారీ వర్షం!
- ఉత్తరాన ఉన్న జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్
- ఇతర ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
- వాతావరణ శాఖ ప్రకటన
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావ్‌పేటలో 6.5, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదీగూడలో 6.5, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 6, తుప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో 5.8, శంకరంపేటలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఇద్దరు రైతులు పిడుగుపాటుకు మృతి చెందారు.