Gorantla Butchaiah Chowdary: జగన్ తన ఇంట్లో పనివాళ్లకు అగ్నిమాపకశాఖలో ఉద్యోగాలు కట్టబెట్టారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Chowdary slams Jagan
షార్ట్స్‌లో చూడండి
'ఫైర్'లో  భారతి పనిమనుషులు... అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సొంత కంపెనీలా పాలించిన జగన్ రెడ్డి... తన ఇంట్లో పనివారికి అగ్నిమాపకశాఖలో ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. 

జగన్ అర్ధాంగి భారతి రెడ్డి ఆదేశాల మేరకు 60 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సిఫారసుతో కూడా అడ్డగోలు నియామకాలు చేపట్టారని వివరించారు. ఈ ఉద్యోగాలు  పొందడానికి వారికి ఉన్న అర్హత వారు జగన్, ఆయన భార్య భారతి, అవినాశ్ రెడ్డిల వద్ద పనిచేయడమేనని గోరంట్ల పేర్కొన్నారు.
Go Back to Shorts
Gorantla Butchaiah Chowdary
Jagan
Fire Dept
YS Bharathi
YS Avinash Reddy
TDP
YSRCP

More Telugu News