ఏపీ ఎన్నికల ఫలితాలపై సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర స్పందన
- ఏపీ ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉందంటూ వ్యాఖ్య
- పవన్ ‘బలమైన తుపాను’ సృష్టించారని కితాబు
- ఎక్స్ వేదికగా స్పందించిన సాయి ధరమ్ తేజ్
పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలియజేస్తూ సాయి ‘ధరమ్ తేజ్’ ఎక్స్ వేదికగా స్పందించాడు. ఆంధ్రప్రదేశ్ వర్తమానం, భవిష్యత్ ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉందంటూ వ్యాఖ్యానించాడు. పవన్ కల్యాణ్ ‘బలమైన తుపాను’ సృష్టించారని కొనియాడాడు. కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రభంజనం సృష్టించారు. తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు.