ఏపీలో తిరుగులేని ఆధిక్యం దిశగా టీడీపీ.. 74 స్థానాల్లో దూకుడు
- కొనసాగుతున్న టీడీపీ అభ్యర్థుల హవా
- జనసేన 11, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యం
- లీడ్‌లో జనసేనాని పవన్, నాదెండ్ల మనోహర్
కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేశ్, గురజాలలో యరపతినేని, గుడివాడలో వెనిగండ్ల రాము, రాజమండ్రి రూరల్‌లో బుచ్చయ్య చౌదరి, జగ్గయ్యపేటలో జ్యోతుల నెహ్రూ, పొన్నూరులో ధూళిపాల, రేపల్లెలో అనగాని, నంద్యాలలో ఫారూఖ్, పెనుగొండలో సబితమ్మ, దెందులూరులో చింతమనేని, రాజమండ్రి టౌన్‌లో ఆదిరెడ్డి వాసు, హిందూపురంలో బాలకృష్ణ, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి, కొవ్వూరులో ముప్పుడి వెంకటేశ్వరరావు, సత్తెనపల్లిలో కన్నా, రాప్తాడులో పరిటాల సునీత తదితరులు లీడ్‌లో ఉన్నారు.
అలాగే, పిఠాపురంలో పవన్ కల్యాణ్, తెనాలిలో నాదెండ్ల మనోహర్, కాకినాడ రూరల్‌లో నానాజీ, జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తదితరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.