హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్

TTD deputy EE Sri Laxmi arrested in murder attempt case
  • ఎన్జీవో కాలనీలో ఎదురెదురుగా శ్రీలక్ష్మి, శివారెడ్డి నివాసం
  • తమకు అప్పు ఇచ్చిన వారికి శివారెడ్డి అడ్రస్ చెబుతున్నారని కక్ష పెంచుకున్న శ్రీలక్ష్మి
  • సుపారీ గ్యాంగ్ ద్వారా అడ్డు తొలగించుకోవాలని భావించిన శ్రీలక్ష్మి
తిరుపతిలో హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. శివారెడ్డిపై హత్యాయత్నం కేసులో తిరుపతిలోని ఎన్జీవో కాలనీ నుంచి శ్రీలక్ష్మితో పాటు భర్త చంద్రారెడ్డిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్న శివారెడ్డి ఫ్లాట్ ఎదురుగానే శ్రీలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే శ్రీలక్ష్మి దంపతులకు అప్పు ఇచ్చిన వారికి... శివారెడ్డి తన అడ్రస్ చెబుతున్నారు. దీంతో వారు శివారెడ్డిపై కక్ష పెంచుకున్నారు.

గతంలో శివారెడ్డి, శ్రీలక్ష్మి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత తమకు అప్పు ఇచ్చిన వారికి అడ్రస్ చెప్పడాన్ని శ్రీలక్ష్మి దంపతులు జీర్ణించుకోలేకపోయారు. శివారెడ్డిని అడ్డు తొలగించుకోవాలని భావించిన... శ్రీలక్ష్మి దంపతులు అతనిపై సుపారీ గ్యాంగుతో హత్యాయత్నం చేశారు. శివారెడ్డి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో శ్రీలక్ష్మి దంపతులే.. ఈ హత్యాయత్నానికి కారణంగా గుర్తించారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
TTD
Sri Laxmi
Andhra Pradesh

More Telugu News