మళ్లీ బరిలోకి దిగుతున్న గుణశేఖర్!

Gunasekhar Special
  • సొంత బ్యానర్లోనే సినిమాలు చేస్తున్న గుణశేఖర్ 
  • జానపద .. పౌరాణికాలకు ప్రాధాన్యత
  • కొత్త ప్రాజెక్టుపై రేపు ప్రకటన  

టాలీవుడ్ లో పౌరాణికాలు .. జానపదాలను సైతం గొప్పగా తీయగల దర్శకుడిగా గుణశేఖర్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే చాలాకాలంగా గుణశేఖర్ సొంత బ్యానర్లోనే సినిమాలు చేస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయి. ఆ మధ్య ఆయన బ్యానర్లో 'శాకుంతలం' సినిమా వచ్చింది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకుంటుందని అంతా భావించారు. 

అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఆ స్థాయిలోనే నష్టాలను చూసింది. ఆ సినిమా మొదలుపెట్టేటప్పుడు సమంతకి ఉన్న క్రేజ్ లో, ఆ సినిమా పూర్తయ్యే సమయానికి మార్పు వచ్చింది. ఆ సినిమా దెబ్బతినడానికి అదొక కారణం అయింది. ఆ సినిమా విడుదల తరువాత గుణశేఖర్ మౌనంగా ఉండిపోయారు.

ఇంతకాలంగా గుణశేఖర్ అదే మౌనాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆయన సినిమాలను ఇష్టపడేవారు, కొత్త ప్రాజెక్టు ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ ఎనౌన్స్ మెంట్ రేపు రానుంది. తమ బ్యానర్లో సినిమా ఎనౌన్స్ మెంట్ రేపు ఉదయం 11 గంటలకు రానుందని ఒక పోస్టర్ ను వదిలారు. ఇది ఏ జోనర్లో ఉంటుంది? .. ఎవరితో ఉంటుంది? అనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తించే విషయం.
Advertisement
Gunasekhar
Director
Tollywood

More Telugu News