కోల్‌కతా ఐపీఎల్ గెలవడంతో షారుఖ్ ఎమోషనల్.. వీడియో ఇదిగో
- భార్య గౌరీ ఖాన్‌ను హత్తుకొని ముద్దు పెట్టిన బాలీవుడ్ బాద్ షా
- 10 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలవడంతో భావోద్వేగానికి గురైన కోల్‌కతా సహ యజమాని
- ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు
కోల్‌కతా జట్టు చివరిసారిగా 2014లో ట్రోఫీ గెలిచింది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇప్పుడు టైటిల్‌ని గెలిచింది. అందుకే షారుఖ్ ఇంతలా ఎమోషనల్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చి అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. కుటుంబ సభ్యులతో కలిసి మైదానం నలువైపులా తిరిగి మ్యాచ్‌కు విచ్చేసిన క్రికెట్ ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు.
కాగా ఇటీవలే వడదెబ్బకు గురైన షారుఖ్ ఖాన్ హాస్పిటల్‌లో చికిత్స అనంతరం కోలుకున్నాడు. దీంతో భార్య గౌరీ ఖాన్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఫైనల్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించాడు. కాగా చెన్నై వేదికగా కోల్‌కతా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా కొనసాగిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్‌కతా ఈ టార్గెట్‌ను కేవలం 10.3 ఓవర్లలోనే ముగించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.