ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా.. ఇన్ స్టా స్టేటస్ కు అర్థం అదేనా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా.. ఇన్ స్టా స్టేటస్ కు అర్థం అదేనా?

Hero Prabhas Shares An Intriguing Status On Instagram
  • త్వరలో తన జీవితంలోకి ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారంటూ ఇన్ స్టాలో వెల్లడించిన డార్లింగ్
  • ఎట్టకేలకు తమ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన హీరో ప్రభాస్ పోస్ట్
అభిమానులు డార్లింగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్ స్టా ఖాతాలో వెల్లడించారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ‘డార్లింగ్స్.. ఫైనల్ గా నా జీవితంలోకి అత్యంత స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. వెయిట్ చెయ్యండి..’ అంటూ ప్రభాస్ తన ఇన్ స్టా స్టేటస్ లో రాసుకొచ్చారు. దీంతో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎట్టకేలకు తమ డార్లింగ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ గతంలో ఎన్నడూ తన సినిమాల గురించి ఇలా ప్రత్యేకంగా చెప్పలేదని, ఈ న్యూస్ కచ్చితంగా పెళ్లి గురించేనని అంటున్నారు. 

పెళ్లి చేసుకునే విషయంపై ప్రభాస్ ను గతంలో చాలామంది అడిగినా ఆయన సూటిగా జవాబివ్వలేదు. ఏటేటా తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. గతంలో హీరోయిన్ అనుష్కతో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఇద్దరూ పెళ్లిపీటలు ఎక్కుతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా బాహుబలి సినిమా తర్వాత అనుష్క కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని, పెళ్లి చేసుకోవడం కోసమే కొత్త సినిమాలు అంగీకరించలేదనే వార్తలు వెలువడ్డాయి. 

అయితే, తామిద్దరం మంచి స్నేహితులమని ఇటు ప్రభాస్, అటు అనుష్క క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికి తెరపడింది. ఆ తర్వాత కూడా హీరోయిన్ కృతి సనన్, ప్రభాస్ ప్రేమించుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఆదిపురుష్ సినిమా తర్వాత వీరిద్దరూ క్లోజ్ గా మూవ్ కావడంతో వీరి ప్రేమ నిజమేనని ఫ్యాన్స్ కూడా భావించారు. తర్వాత కొన్ని రోజులకు కృతి సనన్ వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ప్రభాస్, కృతి సనన్ ప్రేమించుకుంటున్నారనే ప్రచారానికి తెరపడింది. ప్రభాస్ ఇన్ స్టా స్టేటస్ తో హీరో పెళ్లి గురించి మళ్లీ చర్చ జరుగుతోంది. ప్రభాస్ స్టేటస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
Prabhas
Dorling
Bahubali
Prabhas Marriage
Entertainment
Viral News

More Telugu News