సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో కపిల్ సిబల్ గెలుపు
- ప్రత్యర్థి ప్రదీప్ రాయ్‌పై విజయం సాధించిన సిబల్
- గురువారం జరిగిన ఎన్నికలు
- అత్యధికంగా 1066 ఓట్లు పడడంతో కపిల్ సిబల్ గెలుపు
కపిల్ సిబల్ విజయంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఉదారవాద, లౌకిక, ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులకు ఇది భారీ విజయమని ఆయన వ్యాఖ్యానించారు. పదవి నుంచి దిగిపోబోతున్న ప్రధానమంత్రికి ఇది ట్రైలర్ మాత్రమేనని, త్వరలో జాతీయ స్థాయిలో మార్పు జరగనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
హార్వర్డ్ లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సిబల్
కపిల్ సిబల్ హార్వర్డ్ లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చదివారు. 1983లో సీనియర్ న్యాయవాదిగా సేవలు అందించారు. 1989-90 సమయంలో భారత అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో 1995 నుంచి 2002 మధ్య కాలంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మూడు సార్లు పనిచేశారు. కేంద్రమంత్రిగానూ ఆయన పనిచేసిన విషయం తెలిసిందే.