చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ హైదరాబాద్ ఆలయంలో నాలుక కోసుకున్న వ్యక్తి
- శ్రీనగర్‌కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు
- ఆపై బ్లేడుతో నాలుక కోసుకున్న వైనం
- ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- కూటమి 100 నుంచి 145 స్థానాల్లో గెలవాలని ఆకాంక్షిస్తూ లేఖ
ఈ సందర్భంగా నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ మహేశ్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 100 నుంచి 145 సీట్లలో గెలవాలని ఆకాంక్షించాడు. కాగా, జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలంటూ గతంలోనూ మహేశ్ ఇలాంటి పనే చేసినట్టు పోలీసులు తెలిపారు.