ఎన్డీయే కూటమి తిరుగులేని విజయం సాధిస్తుంది: పవన్ కల్యాణ్
- ఇవాళ మంగళగిరిలో ఓటేసిన పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా
- భార్యతో కలిసి వారణాసి చేరుకున్న జనసేనాని
- రేపు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్
- పవన్ కల్యాణ్ కు ఆహ్వానం
ఎయిర్ పోర్టులో ఆయనను జాతీయ మీడియా పలకరించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్డీయే కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని అన్నారు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తమకు మంచి మెజారిటీ వస్తుందని భావిస్తున్నామని తెలిపారు.
ఇక, ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమానికి రావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి తన మద్దతు అందించి, శుభాకాంక్షలు తెలుపుతానని, ఆయన మూడోసారి ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు. వారణాసి వచ్చిన సందర్భంగా పవన్ మెడలో కాషాయ కండువాతో కనిపించారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం వారణాసిలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు.