Chandrababu: ఈ కొన్ని గంటలైనా నిజాయతీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కి లేదు: చంద్రబాబు

Chandrababu slams CM Jagan ahead of polling
షార్ట్స్‌లో చూడండి
తన పేరిట ఓ ఫేక్ వీడియో వైరల్ చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నాయకత్వంపై మండిపడ్డారు. ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోందని, ఈ కొన్ని గంటలైనా నిజాయతీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కు లేదని విమర్శించారు. ఆ జ్ఞానమే ఉంటే ఇలా కులమతాలను రెచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడని చంద్రబాబు స్పష్టం చేశారు. 

"వైసీపీ వాళ్లు సర్క్యులేట్ చేస్తున్న ఫేక్ వీడియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియోనే ఆధారం. దీన్నే వాళ్లు ఫేక్ చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు జగన్ ఇలాంటి ఫేక్ వీడియోలు కుప్పలు తెప్పలుగా చేయిస్తాడు. వీటిని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అంతేకాదు, ఒరిజినల్ వీడియో, ఫేక్ వీడియో క్లిప్పింగ్స్ ను కూడా ఆయన పంచుకున్నారు.
Go Back to Shorts
Chandrababu
Fake Video
Jagan
TDP
YSRCP
General Elections-2024
Andhra Pradesh

More Telugu News