Narendra Modi: కాసేపట్లో విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో... పీవీపీ మాల్ వద్దకు చేరుకున్న చంద్రబాబు, పవన్
ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం విజయవాడలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. విజయవాడలోని పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు.
కాసేపట్లో ఈ రోడ్ షో ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు రోడ్ షో జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు. వీరిద్దరూ కొద్దిసేపటి కిందట రోడ్ షో ప్రారంభ పాయింట్ పీవీపీ మాల్ వద్దకు చేరుకున్నారు.
ప్రధాని రోడ్ షో నేపథ్యంలో విజయవాడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలతో బందర్ రోడ్డు వద్దకు చేరుకున్నారు.