తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్న మాజీ గవర్నర్ తమిళిసై
- 10 రోజుల పాటు బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్న తమిళిసై
- హైదరాబాద్‌లో నేడు ఎన్నికల ప్రచారం
- రాజధానిలో ఉంటూనే వివిధ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం
బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం ఆమె ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమెకు పలువురు బీజేపీ నాయకులు హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో స్వాగతం పలికారు. ఆమె హైదరాబాద్‌లో ఉంటూనే వివిధ లోక్ సభ నియోజకవర్గ స్థానాల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఈ రోజు రాజధాని నగరంలో ప్రచారంలో పాల్గొంటారు. తెలంగాణ ప్రజలు అంటే తనకు ఎంతో అభిమానమని... వారిని మరోసారి కలుసుకునే అవకాశం రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు.