ఎన్నికల బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వీరి గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!
- ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
- రూ. 622 కోట్లతో అత్యంత సంపన్న అభ్యర్థిగా కర్ణాటక కాంగ్రెస్ నేత స్టార్ చంద్రు
- చిల్లిగవ్వ ఆస్తి లేకున్నా బరిలోకి దిగిన ఆరుగురు అభ్యర్థులు
కర్ణాటక కాంగ్రెస్ నేత, స్టార్ చంద్రుగా చిరపరిచితుడైన వెంకటరమణె గౌడ రూ. 622 కోట్లతో ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. రూపాయి ఆస్తికూడా లేని ఆరుగురు అభ్యర్థులు కూడా ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో కర్ణాటకకు చెందిన ప్రకాశ్ ఆర్ఏ జైన్, రామమూర్తి ఎం. రాజారెడ్డి, మహారాష్ట్రకు చెందిన కిశోర్ భింరావ్ లబాడే, నగేశ్ శంభాజీ గైక్వాడ్, దిన్యానేశ్వర్ రావ్‌సాహెబ్ కపాటే ఉన్నారు. వారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం వీరి ఆస్తి సున్నా.