హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ పైకి సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ!
- తమిళంలో హిట్ కొట్టిన 'ట్రూ లవర్'
- ఇక్కడి థియేటర్స్ నుంచి కనిపించని రెస్పాన్స్
- రేపటి నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
- ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్
తమిళంలో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా, మంచి లాభాలను తెచ్చి పెట్టింది. మారుతి - ఎస్ కె ఎన్ కలిసి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు 'ట్రూ లవర్' పేరుతో తీసుకొచ్చారు. గౌరీప్రియ కథానాయికగా నటించిన ఈ సినిమాను, తెలుగు ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. అలాంటి ఈ సినిమా రేపటి నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
పెళ్లి అనేది ఒక నమ్మకం .. అయితే ప్రేమ అనేది పెళ్లివరకూ వెళ్లాలంటే కావలసింది కూడా నమ్మకమే అని సందేశాన్ని ఇచ్చే సినిమా ఇది. ప్రేమ - అనుమానం అనే రెండు అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో నుంచి ఆడియన్స్ కి కావలసిన వినోదం పుడుతుంది. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.