Dil Raju: రామ్ చరణ్ బర్త్ డే.. బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించనున్న దిల్ రాజు

Dil Raju to launch blood donation drive on the ocassion of Ram Charan
షార్ట్స్‌లో చూడండి
'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ పుట్టినరోజు దగ్గరపడుతోంది. ఈ నెల 27న చరణ్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మరోవైపు చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను నిర్వహించబోతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్లాంక్ లో ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ఈ డ్రైవ్ ప్రారంభమవుతుంది. 

సినిమాల విషయానికి వస్తే... చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా... దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ లుక్ కు, టైటిల్  గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ రాబోతోందని మేకర్స్ ప్రకటించారు. 
Go Back to Shorts
Dil Raju
Ramcharan
Tollywood
Blood Donation

More Telugu News