ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ 10 కుంభకోణాలు చేశారు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభం మాత్రమే: సుఖేష్ చంద్రశేఖర్
- తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
- తీహార్ క్లబ్‌కు స్వాగతమంటూ వ్యంగ్యాస్త్రాలు
- కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతం అవుతుందున్న సుఖేష్
- త్వరలోనే అప్రూవర్‌గా మారి నిజాలన్నీ బయటపెడతానంటూ లేఖలో వెల్లడి
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్నారు. శుక్రవారం ఆయనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. దాంతో న్యాయస్థానం ఆరు రోజుల ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్‌ను ఈడీ విచారించనుంది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ కార్యకర్తలు, నేతలు నిరసనలు తెలుపుతున్నారు. అటు ప్రతిపక్ష కూటమి ఇండియా నేతలు కూడా ఢిల్లీ సీఎం అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్టు అప్రజాస్వామికమని కూటమి పార్టీలు పేర్కొన్నాయి. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడానికి ఇండియా కూటమి సిద్ధమైంది.