కవితకు ధైర్యం చెప్పిన అనిల్, కేటీఆర్, హరీశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కవితకు ధైర్యం చెప్పిన అనిల్, కేటీఆర్, హరీశ్

KTR and Harish Rao meets Kavitha
  • ఢిల్లీలో ఈడీ కస్టడీలో ఉన్న కవిత
  • ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన కుటుంబ సభ్యులు
  • న్యాయ పోరాటం చేద్దామని ధైర్యం చెప్పిన వైనం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23 వరకు కవితను విచారించేందుకు ఈడీకి అనుమతిని ఇచ్చింది. మరోవైపు కాసేపటి క్రితం కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు కలిశారు. కవిత యోగ, క్షేమాలను వీరు కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు. ప్రతిరోజు కవితను కుటుంబ సభ్యులు, ఆమె న్యాయవాదులు కలుసుకునే వెసులుబాటును కోర్టు కల్పించిన సంగతి తెలిసిందే. కుటుంబ భోజనం తెప్పించుకోవడానికి కూడా కోర్టు అనుమతించింది.
Advertisement
Kavitha
KTR
Harish Rao
BRS
Enforcement Directorate

More Telugu News