కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత.. కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరనున్న ఈడీ
- లిక్కర్ స్కామ్ లో నిన్న సాయంత్రం కవిత అరెస్ట్
- నిన్న అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న కవిత, ఈడీ అధికారులు
- రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే గడిపిన కవిత
కవితకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. లిక్కర్ స్కామ్ లో కవితను లోతుగా విచారించేందుకు ఆమెను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు కోరనున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కవిత అరెస్ట్ తో... ఇటు తెలంగాణ రాజకీయాలతో పాటు, అటు లిక్కర్ స్కామ్ విచారణలో పరిణామాలు ఊహించని మలుపు తిరిగాయి.